తెలుగు ఇండస్ట్రీతో ఆది పినిశెట్టికి బంధం

పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్‌ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్‌ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీటోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్‌నర్‌ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్‌ చూస్తుంటే సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. డబ్బు చాలా అవసరమై దొంగతనాలు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండే ఆది, ఆయన ఫ్రెండ్‌ యోగిబాబుకు అనుకోకుండా ఓ అసైన్‌మెంట్‌ వస్తుంది. ఓ సైటింస్ట్‌ దగ్గర చిప్‌ దొంగతనం చేస్తే 20 లక్షలు ఇస్తామని చెప్పడంతో ఆది, యోగిబాబు దాని కోసం వెళ్తారు. అదే సమయంలో అనుకోకుండా ఓ మిషిన్‌లోంచి ఇంజక్షన్‌ వచ్చి యోగిబాబుకు గుచ్చుకుంటుంది. దాంతో అతను అమ్మాయి వేషంలో హన్సికలా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. తిరిగి యోగిబాబు తన ఒరిజినల్‌ బాడీలోకి వచ్చాడా లేదా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

ఇదే కాన్సెప్ట్‌కు కావాల్సినంత హాస్యం జోడిరచినట్లు ట్రయిలర్‌ చూస్తే క్లియర్‌ కట్‌గా తెలిసిపోతుంది. థియేటర్‌కు వచ్చిన ఆడియెన్స్‌ను బోర్‌ కొట్టించకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే మాత్రం సినిమా పాసవ్వడం ఖాయం. పైగా ఆదికి తెలుగులో మార్కెట్‌ పెంచుకోవడానికి ఇదే కరెక్ట్‌ బొమ్మ. మనోజ్‌ దామోదరన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదికి జోడీగా హన్సిక మోత్వానీ, పాలక్‌ లల్వానీ నటిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.