తమ భర్తలను వెంటనే విడుదల చేయాలి అంటూ భార్యలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.ఇలా భార్యలందరూ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడానికి గల కారణం ఏంటి తమ భర్తలను ఎందుకు అరెస్టు చేశారు అసలు ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అనే విషయానికి వస్తే…ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోనూ బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ క్రమంలోని బాల్యవివాహాలను అరికట్టడం కోసం అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బాల్య వివాహాలను అరికట్టే దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇలా మైనర్ గా ఉన్నటువంటి వారిని వివాహం చేసుకున్న 2,258మందిని పోలీసులు అరెస్టు చేయడంతో వీరి భార్యలు ఏకంగా రోడ్డుపైకి ఎక్కి తమ భర్తలను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని ధుబ్రా జిల్లాలో చోటు చేసుకుంది. ఇలా భార్యలందరూ కూడా తమ భర్తలను విడుదల చేయకపోతే ధర్నాలు చేస్తామంటూ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇలా మహిళలందరూ పోలీసులను హెచ్చరించడంతో పరిస్థితి అదుపుతప్పుతుందన్న ఉద్దేశంతో పోలీసులు రోడ్లపైకి వచ్చిన మహిళలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన తరుణంలో పోలీసులు మహిళలపై లాఠీ చార్జ్ చేశారు. ఇలా బట్టల కోసం మహిళలు రోడ్లపైకి రావడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.