పుల్వామా పై ప్రధాని ఎందుకు వెంటనే స్పందించలేదు, గల్లా ప్రశ్న

గంటూరు  లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్  పుల్వామ దాడి మీద ప్రధాని నరేంద్రమోదీని సూటిగా కొన్ని ప్రశ్నలడిగారు. ప్రశ్నలడుగుతూనే పుల్వా మా దాడి కేంద్రం వైఫల్యమే అంటూ  ప్రధానిని కూడ బాధ్యుని చేశారు. వివరాలు ఇవిగో..

‘‘కశ్మీర్ లో కావాలనే  మీరు రాష్ట్రపతి పాలన తీసుకువచ్చారు. పాలన మీ చేతిలో ఉంచుకున్నారు. జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు అన్ని పీఎం చేతిలోనే ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు విమానంలో వెళ్లాలని కోరినా అనుమతించలేదు. నిఘా మొత్తం మీ చేతిలో ఉంది. అయినా దాడి జరిగింది. ఇది నిఘా వైఫల్యం, ప్రొసీజర్ లాప్స్,’’ అని అన్నారు.

వైఫల్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా..? అని ఆయన నిలదీశారు. రాజమహేంద్రవరం లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబును పాకిస్తాన్ ఏజంటుగా వర్ణించిన నేపథ్యంలో ఆయన ఈ దాడి మొదలుపెట్టారు. ప్రధానికి రెండు ప్రశ్నలు వేశారు :

  1. మధ్యాహ్నం  3.10 కి దాడి జరిగితే 6.40 వరకూ ప్రధాని ఎక్కడున్నారు,  ఎందుకు స్పందించలేదు

2. అఖిలపక్షం పిలిచి ప్రధాని ఎందుకు హాజరుకాలేదు

 పుల్వామాను  రాజకీయం చేయొద్దంటూనే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారుఅని అన్నారు.

కాశ్మీర్ ప్రజలు భారతీయిలు కాదన్న మేఘాలయ గవర్నర్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

అమిత్ షా చంద్రబాబు పై చేసిన  వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

.