ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు ఇద్దరు హంతకులను లైవ్ ఎన్ కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్ కౌంటర్ కు జర్నలిస్టులను ఆహ్వానించి ఆ సీన్లను కెమెరాలో బంధించమని కోరడం విశేషం. ఎన్ కౌంటర్ లో ముస్తకిమ్, నౌషద్ అనే ఇద్దరు హంతకులను మట్టు బెట్టినట్టు అలీగడ్ ఎస్పీ అజయ్ సాహ్ని చెప్పారు. చనిపోయిన వారు గత నెలలో ఇద్దరు పూజారులను, రైతులను, దంపతులను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులని తెలిపారు. ఎన్ కౌంటర్ వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
కింద లింక్ పై క్లిక్ చేయండి మరో వీడియో వస్తుంది.
https://www.youtube.com/watch?v=fAhGvY1vGbs
గురువారం ఉదయం ఇద్దరు ఆగంతకులు బైక్ పై దూసుకెళుతున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నించగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. వారిని వెంబడించడంతో ఓ ప్రభుత్వ కార్యాలయంలో దాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు ఆఫీసును రౌండప్ చేయడంతో వారు తప్పించుకునేందుకు వీలు లేదు. ఈ లోపు మీడియాకు సమాచారం అందించి ఆ హంతకులను ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.