దారుణం: రోడ్డు ప్రమాదంలో ఆడ శిశువుకి జన్మనిచ్చి మరణించిన తల్లి?

ప్రస్తుత కాలంలో దేశంలో వాహనాల సంఖ్య రోజుకి విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి సొంత వాహనం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఈరోజు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమంది ప్రాణాలతో బయటపడి జీవితాంతం అవిటి వారిలా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టినప్పటికీ వాహనాలు నడిపేవారు నిర్లక్ష్యం అజాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కూడా రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో గాయపడిన గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చి మరి తుది శ్వాస విడిచింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తర ప్రదేశ్‌ లోని ఫిరోజాబాద్ జిల్లా, నర్ఖి ప్రాంతంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని దనౌలాకు చెందిన రాము, కామిని ఇద్దరు భార్య భర్తలు. కామిని ప్రస్తుతం 8 నెలల గర్భిణి గా ఉంది. అయితే బుధవారం రాము అతడి భార్య కామిని కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు బార్త్రా గ్రామ సమీపంలోకి రాగానే ఒక ట్రక్కు వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు దూరంగా ఎగిరి రోడ్డుపై పడ్డారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ట్రక్ ఢీకొట్టడంతో దూరంగా ఎగిరి పడిన కామిని గర్భంతో ఉండటం వల్ల రోడ్డు మీద ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రమాదంలో ఎక్కువగా గాయపడటం వల్ల శిశువుకు జన్మనిచ్చిన కొంత సమయానికి కామెడీ తుది శ్వాస విడిచింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా కామిని అప్పటికే మృతి చెందింది. అయితే, శిశువు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన వారికి న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారి దీక్ష విరమించుకున్నారు.