గౌరవమైన వైద్య వృత్తిలో ఉంటూ స్నేహితులతో కలిసి ఈ డాక్టర్ చేసిన పని తెలిస్తే ఛీ కొడతారు..?

డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైనది. ప్రాణాపాయంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడి దేవుడికి మరొక రూపంగా ఉంటున్న కొందరు డాక్టర్లు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక వైద్యుడు తన స్నేహితురాలిని ఆసుపత్రికి పిలిపించి మరొ ఇద్దరు యువకులతో కలిసి ఆమె మీద అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే… మహిళా ఉపాధ్యాయురాలితో స్నేహం పెంచుకున్న డాక్టర్ ఆమెను మాయమాటలతో ఆసుపత్రికి పిలిపించి ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో స్నేహం పెంచుకొని ఇటీవల ఆమెను తన ఆసుపత్రికి పిలిపించాడు.

ఆ తర్వాత సదరు యువతిని తన హాస్టల్ గదికి తీసుకెళ్లి అక్కడ ఉంటున్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతి పై సామూహిక అత్యాచారం చేశారు. కొంత సమయం తర్వాత అక్కడినుండి బయటపడ్డ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు ఎంతో గౌరవమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి దారుణానికి పాల్పడటంతో నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.