కేంద్రమంత్రి అనంతకుమార్ కన్నుమూత

బిజెపిని కర్నాకటలో ఒక బలమయిన శక్తిగా మార్చడంలో కీలకపాత్ర వహించిన కేంద్ర కేంద్ర మంత్రి అనంత్ కుమార్ (59)  చనిపోయారు.  సోమవారం తెల్ల వారు జామున  1.30 గంటల సమయంలో  ఒక ప్రయవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం మృతదేహాన్ని ఆయన బసవన గుడి లోని  స్వగృహానికి తీసుకువచ్చారు. అనంత్ కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.  భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడి నేషనల్ కాలేజీ గ్రౌండ్స్ కు తీసుకువచ్చారు.

అంతకు ముందు ఆయన క్యాన్సర్ న్యూయార్క్ , లండన్  లలో చికిత్స పొందారు. కొద్ద రోజుల కిందటే బెంగూళూరులోని   శ్రీ శంకర క్యాన్సర్ ఆసుపత్రిలో చేరారు. 

ఆయన కర్నాటక బీజేపీకి అధ్యక్షునిగా పనిచేశారు. అనంత్ కుమార్ 6 సార్లు దక్షిణ బెంగళూరు స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం అనంత్ కుమార్  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంలో అక్టోబర్ 28వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్  బెంగుళూరు వచ్చి ఆయనను పరామర్శించారు.

అనంత్ కుమార్ తెలుగు సంతతికి చెందిన వారు. ఆయన పూర్వీకుల కర్నూలు జిల్లా  అళ్లగడ్డ ప్రాంతం నుంచి కర్నాటకకు వలస వెళ్లారు.  న్యూఢిల్లీలో తెలుగు వారి కార్యక్రమాలకు హాజరయినపుడల్లా ఆయన ఈ విషయం  చెబుతుండే వారు.చాలా కాలం వాళ్ల ఇంట్లో తెలుగు మాట్లాడే వారు.