మోదీకి ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించిన ట్రంప్ !

pm modi

వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డొనాల్డ్ ట్రంప్, ప్రతిష్ఠాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించారు. భారత్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని, అమెరికాతో ఆ దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం మోదీ నేతృత్వంలో ఎంతో బలపడిందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.

Trump Awards Prestigious Legion of Merit Award to Modi

అయితే , వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోదీ తరఫున యూఎస్ లో భారత దౌత్యాధికారి తరణ్ జిత్ సింగ్ సంధు అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును ప్రభుత్వ అధినేతలకు మాత్రమే ఇస్తామని ఈ సందర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. యూఎస్, ఇండియా సంబంధాలు మరింతగా బలపడటం వెనుక నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

కాగా , భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే పలు దేశాలు ఎన్నో అవార్డులను అందించాయి. 2016లో సౌదీ అరేబియా ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్’, ‘స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్’ అవార్డులను ప్రకటించగా, 2019లో రష్యా ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్’ను, యూఏఈ ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు’ను అందించాయి.