సులభంగా డబ్బు సంపాదించడం కోసం చాలామంది దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాళాలు వేసిన ఇళ్లల్లోకి చొరబడుతూ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్తూ ఉంటారు. మరి కొంతమంది దొంగలు మరింత ధైర్యం చేసి హై సెక్యూరిటీ ఉన్న బ్యాంకులలోకి కూడా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా బ్యాంకులలో దొంగతనం జరిగిన ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా బ్యాంకు లాకర్ లో ఉన్న కోటి రూపాయల విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం చేయటానికి ఆ దొంగలు చేసిన ప్లానింగ్ కి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వివరాలలోకి వెళితే…ఇటీవల కాన్పూర్‌లోని ఎస్‌బీఐ భనుతి శాఖలో భారీ దొంగతనం జరిగింది. బ్యాంక్ లాకర్ లో ఉన్న 1.8 బంగారాన్ని దింగలించారు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని దొంగలించటానికి ఆ దొంగలు మాస్టర్ ప్లాన్ వేసి స్కెచ్ గీసుకున్నారు. వారి ప్లాన్ ప్రకారం.. ఆఫీసు పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి మరీ బ్యాంక్‌లోకి చేరుకున్నారు.a తర్వాత లాకర్ రూమ్ లో ఉన్న లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం చోరీ చేశారు.
ప్రతిరోజులాగే ఉదయం బ్యాంక్‌కు వచ్చిన ఉద్యోగులు బ్యాంక్ లో దొంగతనం జరిగిందన్న విషయాన్ని గమనించి షాకయ్యారు. ఈ క్రమంలో ఎంత సొమ్ము దొంగతనం చేశారో తెలుసుకునేందు బ్యాంకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. కొన్ని గంటల తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైంది అన్న విషయం గురించి ఒక అంచనా వచ్చారు. దీంతో, వెంటనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించారు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల ద్వారా దొంగల కోసం గాలింపు ప్రక్రియ చేపటినట్టు తెలిపారు. అయితే, బ్యాంకు గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.