పీజీ స్టూడెంట్ పై కన్నేసిన ప్రిన్సిపల్.. ఫోన్ చేసి మరీ దారుణానికి పాల్పడిన ప్రిన్సిపల్!

ప్రస్తుత కాలంలో దైవ సమానులైన ఉపాధ్యాయులు కూడా విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. గౌరవపదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థినుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ప్రస్తుత కాలంలో అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తరచూ ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి కీచక ఉపాధ్యాయులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం తమ వక్రబుద్ధిని మార్చుకోవటం లేదు. తాజాగా తమిళనాడులో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పీజీ చదువుతున్న విద్యార్థినిపై కన్నేసిన ప్రిన్సిపల్ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. వీరి సంభాషణకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే… చెన్నై లోని నందనమ్‌ లో ఉన్న వైఎమ్‌సీఏ కాలేజ్‌ లో వందల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. ఈ కాలేజీలో జార్జ్‌ అబ్రహం అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల పీజీ విద్యార్థిని పై అబ్రహం కన్ను పడింది. ఆ తర్వాత ఆమె నెంబర్ తీసుకొని తరచూ ఆమెకు ఫోన్ చేయడమే కాకుండా వాట్సాప్‌లో మెసేజ్ లు కూడా పెట్టేవాడు.
ఈ క్రమంలో ఒకసారి యువతీకి ఫోన్ చేసి తనతో గడపాలని ఉందని చెప్పాడు. ప్రస్తుతం యువతికి, జార్జ్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఆడియోలో.. ” కాలేజ్‌లో ఉన్న వారంతా నాకు ఇష్టమైన స్టూడెంట్సే.. కానీ, నువ్వు మాత్రం అందరికంటే నాకు చాలా ప్రత్యేకం. నీతో మాట్లాడలని, గడపలని ఉంటుంది. ఓ సారి ఇంటికి వస్తే కలుద్దాం. నువ్వు రాకపోయినా ఏమీ అనుకోను” అని అన్నాడు. ఆ యువతికి ప్రిన్సిపల్‌ ఉద్దేశ్యం అర్థం అయింది. ‘మీరు నన్ను ఆ పని కోసం ఇంటికి పిలుస్తున్నారని నాకు అర్థం అయింది” అని అంది. అందుకు ఆ ప్రిన్సిపల్‌ ” అవును నాకు నీతో గడపాలని ఉంది. ఓ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను అయినా కూడా నేను కూడా ఓ మనిషినే కదా.. నిన్ను మొదటి సారి చూసినపుడు ప్రత్యేకంగా అనిపించావు” అని చెప్పుకొచ్చాడు. ఇలా వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కాలేజ్ ముందు నిరసనకు దిగి వెంటనే ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

அத்துமீறும் Principal.. வெளியே சொல்ல பயப்படும் மாணவிகள்! YMCA Students Protest against George!