భార్యాభర్తలని ప్రూఫ్ చూపించిన లంచం అడిగిన పోలీసులు… ఆ దంపతులు చేసిన పనికి పోలీసులు షాక్..?

సాధారణంగా ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి అందరికీ ఎదురవుతుంది. ఇటీవల అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుపడి లంచం ఇవ్వకపోతే అడ్డమైన కేసులు పెట్టి జైలులో వేస్తామని దంపతులను బెదిరించారు. ఏం చేయలేని స్థితిలో దంపతులు పోలీసులకు లంచం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఆ దంపతులు చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే… కార్తీక్ పార్ట్ అలియాస్ కార్తీక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బెంగళూరు సిటీలోని హెబ్బాళ సమీపంలోని మాన్యతా టెక్ పార్క్ సమీపంలో నివాసం ఉంటున్నారు. మాన్యతా టెక్ పార్క్ సమీపంలోనే కార్తీక్ స్నేహితులు కొందరు నివాసం ఉంటున్నారు. కార్తీక్ అతని స్నేహితులు ఎవరి ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినా, ఫంక్షన్లు జరిగినా అందరూ హాజరౌతుంటారు. తాజాగా కార్తీక్ దంపతులు ఇటీవల తన స్నేహితుడి కుటుంబంలో జరిగిన పార్టీకి హాజరై అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానీస్టేబుల్ రాజేష్, కానీస్టేబుల్ నాగేష్ హోస్సళ కారులో వెళుతూ కార్తీక్ దంపతులను అడ్డగించారు. ఆ తర్వాత దంపతులను అడ్డమైన ప్రశ్నలు వేసి వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా అర్దరాత్రి మీకు ఇంట్లో ఏం పనిపాటా లేదా, రోడ్ల మీద తిరుగుతున్నారు, అసలు మీరు మొగుడు పెళ్లామేనా ? అంటూ రెచ్చిపోయారు..

కార్తీక్ దంపతులు రుజువు చూపించిన కూడా పోలీసుల వినకుండా మూడు వేల రూపాయలు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళమని లేదంటే అడ్డమైన కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరించారు. దీంతో కార్తీక్ తన వద్ద డబ్బులు లేవని చెప్పినా కూడా ఫోన్ పే చేసిన పరవాలేదని కానిస్టేబుల్ చెప్పటంతో వెయ్యి రూపాయలు ఫోన్ పే చేశాడు. పోలీసులు వెళ్లిన తర్వాత తరువాత కార్తీక్ తనకు జరిగిన అన్యాయం గురించి స్నేహితులు, బెంగళూరు పోలీసుల ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేసి వరుసగా ట్విట్లు చేశారు. డీసీపీ అనూప్ శెట్టి దృష్టికి ఈ విషయం వెళ్ళటంతో హెడ్ కానీస్టేబుల్ రాజేష్, కానీస్టేబుల్ నాగేష్ ను సస్పెండ్ చేశామని, విచారణకు ఆదేశాలు జారీ చేశామని డీసీపీ అనూప్ శెట్టి తెలిపారు.