ఇంటికి లేట్ గా వచ్చిందని భార్యను ప్రశ్నించిన భర్త.. భార్య చేసిన పనికి అందరూ షాక్..?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాకాకుండా కొంతమంది చిన్న చిన్న గొడవలను పెద్దవి చేస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూ ఉంటారు. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుత కాలంలో భార్య భర్తల బంధం మూన్నాళ్ళ ముచ్చటగానే నిలుస్తోంది.

సాధారణంగా బయటికి వెళ్లేవారు రావటం ఆలస్యం అయితే ఎందుకు లేట్ అయింది అని అడుగుతారు. అయితే ఇటీవల ఇలా బయటికి వెళ్లిన భార్య ఇంటికి లేటుగా వచ్చింది. దీంతో ఎందుకు లేట్ అయింది అని అడగడమే ఆ భర్త పాలిట శాపం అయింది. భర్త అలా ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన భార్య ఏకంగా తన భర్త పై యాసిడ్ తో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. ఎందుకు లేట్ అయిందని భార్యను ప్రశ్నించడంతో భర్త పై యాసిడ్ తో భార్య దాడి చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. కూపర్ గంజి ప్రాంతంలో దబ్బు అనే వ్యక్తి తన భార్య తో కలసి నివసిస్తున్నాడు.

ఇటీవల పని ఉండటం వల్ల అతని భార్య బయటకు వెళ్ళింది. అయితే ఇంటికి రావటం చాలా ఆలస్యం అయ్యింది. దీంతో దబ్బు ఎందుకు లేట్ అయింది అంటూ తన భార్యని ప్రశ్నించాడు. భర్త ఇలా అడగటంతో ఆగ్రహానికి గురైన భార్య కోపంతో ఊగిపోతూ తన వద్ద ఉన్న యాసిడ్ దబ్బు మొఖంపై పోసింది. అయితే యాసిడ్ పడటంతో మంట వల్ల దబ్బు గట్టిగా కేకలు వేశాడు . దీంతో స్థానికులు అతనిని గమనించి చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డబ్బు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.