తెలుగు డాక్టర్ ప్రీతిరెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన బాయ్ ఫ్రెండ్

ఆస్ట్రేలియాలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన తెలుగు డాక్టర్ ప్రీతి రెడ్డి కేసు విషాదంగా ముగిసింది. ప్రీతి రెడ్డి తన కారులోనే హత్యకు గురైంది. ఆమెను మాజీ ప్రియుడే ముక్కలు ముక్కలుగా నరికి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.

హైదరాబాద్ కు చెందిన డెంటల్ డాక్టర్ ప్రీతిరెడ్డి సిడ్నీలో పని చేస్తున్నారు. ఆమె ఆదివారం ఉదయం సిడ్నిలోని  ఓ రెస్టారెంటు వద్ద టిఫిన్ చేసే సమయంలో కనిపించారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. దీంతో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు విచారించగా సిడ్నిలోనే ఓ రోడ్డులో ప్రీతి కారు పార్కింగ్ చేసి ఉంది. అందులో చూడగా ఓ బస్తాలో ప్రీతిరెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి కట్టి పడేశారు. 

ప్రీతిరెడ్డికి బాయ్ ఫ్రెండ్ హర్షవర్ధన్ నార్డే ఉన్నారు. హర్ష వర్ధన్ కూడా డాక్టరే. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. కొంత కాలంగా ప్రీతి నార్డేను దూరం పెడుతోంది. దీంతో కోపం పెంచుకున్న నార్డేనే ప్రీతిని పథకం ప్రకారం పిలిచి చంపినట్టు తేలింది. అయితే ప్రీతి అదృశ్యం పై నార్డేను పోలీసులు ఫోన్ లో ప్రశ్నించారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. 

 దీంతో కంగారు పడిన నార్డే తన కారును స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ముందు వెళుతున్న ట్రక్కు ఢికొని రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రీతి రెడ్డి డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.