అయోధ్య కు చర్చలే పరిష్కారం, సుప్రీంకోర్టు తీర్పు

మధ్య వర్తిత్వం ద్వారా అయోధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం కొనుగొనాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. చర్చలే నిజమయిన పరిష్కారమని కోర్టు తీర్మానించింది.

ముస్లిం, హిందూ వర్గాలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్  ఎఫ్ ఎమ్ ఐ కలీఫుల్లా కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు.  Art of Living Foundation శ్రీ శ్రీ రవి శంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరాంలు కమిటీ లో సభ్యులు.

కమిటీ సమావేశాలు అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో  జరుగుతాయి. మీడియాను అనుమతించరు. అయితే, సమావేశాలను మొత్తంగా వీడియో తీస్తారు. కమిటీ నాలుగు వారాలలో పని మొదలుపెట్టాలి. ఎనిమిది వారాలలో మధ్య వర్తిత్వం పూర్తి చేయాలి.