ఓ ప్రభుత్వ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే అంబాలగన్ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. ఆ వీడియో కింద ఉంది చూడండి.
ప్రభుత్వ కార్యక్రమానికి కిరణ్ బేడి, ఎమ్మెల్యే అంబాలగన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. స్టేజి మీద ఎమ్మెల్యే ప్రసంగానికి సంబంధించి కిరణ్ బేడికి, అంబాలగన్ కు మధ్య గొడవ అయ్యింది. అసలు గొడవకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.