సానియా మీర్జా నోరు విప్పింది. 45 మంది సిఆర్ పిఎప్ జవాన్ల మృతికి కారణమయిన అత్మాహుతి దాడిని ఆమె సరిగ్గా ఖండించలేదని సోషల్ మీడియా లో ఆమె మీద విమర్శలు వర్షం కురుస్తూ ఉంది.
సోషల్ మీడియా లో సెలెబ్రిటీల కదలికల మీద ఎపుడూ నిఘా ఉంటుంది. దేశంలో జరిగే సంఘటలన మీద సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సెలెబ్రిటీలు ఎలా స్పందిస్తుంటా రో గమనించడం, తమకు నచ్చని విధంగా ఈ స్పందన లేకపోతో ట్రాల్ చేయడం జరుగుతూ ఉంటుంది.ఇపుడు ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ జయించిన సానియా మీర్జామీద సోషల్ మీడియా లోని ఒక సెక్షన్ దాడి మొదలుపెట్టింది. ఈ దాడి సారాంశం సింపుల్. పుల్వామా దాడి మీద ఆమె ఖండన అంతగా పదునుగా లేదని ,దీనికి కారణం, ఆమె ముస్లిం కావడం.. పాకిస్తానీ కోడలు కావడమే అని ఈ విమర్శలు చెప్పకనే చెబుతాయి. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహమాడినప్పటి నుంచి ఇండోపాక్ సంబంధాలలో అపశ్రతి వినిపించినపుడల్లా సోషల్ మీడియా లోని ఆమె వ్యతిరేకులు సానియాను విమర్శిస్తూనే ఉన్నారు. ఆమె మాట్లాడితే చర్చ, ఆమె మౌనంగా ఉంటే చర్చ. తన మీద వస్తున్న ఈ విమర్శలకు సానియా మీర్జా సమాధానమిచ్చారు. తనమీద చేస్తున్న సోషల్ మీడియాలో విద్వేషం రెచ్చ గొట్టడం కనిపిస్తుందని ఆమె ఆనుమానించారు. ఆమె స్పందన బాగా వైరలవుతూ ఉంది.
దేశభక్తి ని నిరూపించేందుకు మొగసాల కెక్కాల్సిన అవసరం లేదని, రోడ్డెక్కి గొంతు చించుకోనవసరం లేదని ఆమె చెప్పారు. సెలెబ్రిటీల చేత ఇలా చేయించే పనిని మరోపని లేని వాళ్లు పనిగట్టుకుని చేస్తున్నారని అంటూ పుల్వామా దాడి ఖండించని వారెవరుంటారు అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14 భారతదేశానికి బ్లాక్ డే, ఇలాంటి దుర్ఘటన మనం మరొకసారి చూడరాదని అన్నారు. ఇలా విమర్శించని వాళ్లకు ఏదో సమస్య ఉందని అనుకోవాలని అన్నారు. ఆ (ఫిబ్రవరి 14) రోజు మర్చిపోలేని దుర్దినమే కాదు, అంతేకాదు, క్షమించలేని వీలు లేని సంఘటన. అయినా నేను విశ్వశాంతికోసం ప్రార్థిస్తాను, మీరు అదే పని చేయాలి, విద్వేషం రెచ్చగొట్టడం మానుకుని, అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆమె స్పందన ఇపుడు పెద్ద చర్చనీయాంశమయింది. ఇది ఇదీ ఆమె స్పందన
We stand united ? #PulwamaAttack pic.twitter.com/Cmeij5X1On
— Sania Mirza (@MirzaSania) February 17, 2019