సినిమా ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ ఓ కుదుపు కుదుపేసింది. అయినా కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఆగడం లేదని పలువురు నటినటీమణులు ఆరోపిస్తున్నారు. సినిమాలలో అవకాశాలు రావాలంటే వారికి పడక సుఖం అందించాల్సిందేనని పలువురు నటులు బహిరంగంగా ఆరోపించారు. పలువురు ప్రముఖులు కూడా ఈ ఆరోపణలు నిజమని తేల్చారు. దీంతో సినీ ఇండస్ట్రీలో అందరి బాగోతం బయటపడింది.
అయితే తాజాగా బాలీవుడ్ నటి షర్లీన్ చోప్రా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ డిన్నర్ అనే పదానికి అర్ధమేంటో తెలుసా అని నటి షర్లిన్ చోప్రా ప్రశ్నించి దాని అర్ధమేంటో తెలిపింది. షర్లీన్ చోప్రా ఏమన్నారంటే..
‘నటీమణులను దర్శకులు, నిర్మాతలు అప్పుడప్పుడు డిన్నర్ కు పిలుస్తుంటారు. వాళ్లు పిలుస్తున్నది భోజనానికి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. శారీరక సుఖం కోసం వారు పిలుస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అవకాశాల కోసం వెళ్లినప్పుడు రాత్రి వారి ఆఫీసులకు డిన్నర్ కు పిలిచేవారు. మొదట్లో అనుమానం వచ్చేది. ఆ తర్వాత పూర్తిగా అర్థమైంది.
వారు నాతో అసభ్యంగా ప్రవర్తించబోయినప్పుడు నేను వారిని వ్యతిరేకించి బయటకు వచ్చేదానిని. తీరా రూంలో కూడా వారు మాములుగా మాట్లాడుతున్నట్టే ఉంటారు. వారు మహిళ పై చేయివేసి తిక్క తిక్క మాట్లాడే వరకు కూడా గుర్తు పట్టలేం. వారు ముందుగానే ప్లాన్ ప్రకారం చేస్తారు. ఆ సమయంలో డబ్బు, సినిమా అవకాశాలను ఎరగా చెప్తారు.
చాలా మంది సిని గ్లామర్ మీద పిచ్చితో గ్రామాలు, పట్టణాలు, మోడలింగ్ నుంచి వచ్చేవారు మోసపోయారు. చీకటి రాత్రిలో వారికి సుఖాన్ని అందించి నలిగిపోయారు. నా కళ్ల ముందే ఎంతో మంది అమ్మాయిలు వారి కామ తాపానికి నలిగిపోయారు. కానీ నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉండేదాన్ని . నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తప్పదు కదా. కానీ కొంత మందిని చూస్తే జాలి వేసేది. వారిని వాడుకొని అవకాశాలు ఇప్పించకుండా తిప్పుకునేవారు. ప్రతిరోజు వారి పై అఘాయిత్యాలు చేసేవారు.
పరువు పోతుందని వారు ఎవరికి చెప్పుకోలేక తిరిగి వారి గ్రామాలకు వెళ్లిపోయేవారు. దీంతో అప్పటి నుంచి ప్రతిభ కలిగిన దర్శకులు, నిర్మాతలనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నా. చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన వారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయి’ అని షెర్లిన్ తెలిపింది.