అగ్రకుల పేదలకు విద్యాసంస్థల్లో,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. యూత్ ఫర్ ఈక్వాలిటి అనే సంస్థకు చెందిన కౌశల్ కాంత్ మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక చెల్లదని వాదిస్తూ ఈ బిల్లును (ఇంకా చట్టం కాలేదు) కొట్టి వేయాలని ఆయన కోర్టును కోరారు.
అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడమనేది రాజ్యంగా ప్రాథమిక నియమాలను ఉల్లంఘిస్తుందని, అదే విధంగా సుప్రీంకోర్టే గతంలో విధించిన 50 శాతం పరిమితిని కూడా ఇది ఉల్లంఘిస్తుందని మిశ్రా పిటిషన్లో పేర్కొన్నారు.
బుధవారం నాడు ఈ బిల్లు రాజ్యసభలో 165/7 ఓట్లతో నెగ్గింది. 124 రాజ్యంగా సవవరణ బిల్లుగా పార్లమెంటు ముందుకు వచ్చిన రిజర్వేషన్ల బిల్లును మంగళవారం నాడు లోక్ సభ ఆమోదించింది.