మోదీ, కేసీఆర్ పై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

కాంగ్రెస్ గర్జనలో తెలుగుతో ప్రసంగం మొదలు పెట్టిన రాహుల్ గాంధీ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. తర్వాత ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. మీరంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకొస్తాయని, మన నిధులు మనకొస్తాయని , లక్షల ఉద్యోగాలు మనకొస్తాయని కళలు కన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడి అభివృద్ధి చెందితే అందరి జీవితాలు బాగుపడతాయని మీరంతా విశ్వసించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కల సాకారం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఒక కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్రము కోసం పోరాడిన, బలిదానాలు చేసిన వారికీ ఆయన అనేక హామీలు ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసిన అమరవీరులకు నేను స్రధానాలి ఘటిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన కుటుంబాలను ఆదుకుంటానని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసాడు. ఒక లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. తెలంగాణ యువకులందరికి రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నాడు. నాలుగేళ్ల పాలనలో కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదు, నియామకాలు జరపలేదు.

రాఫెల్ కాంట్రాక్టును HAL నుండి గుంజుకుని ఆత్మీయులకు కట్టబెట్టాడు మోడీ. యూపీఏ ప్రభుత్వ హయాంలో 524 కోట్లకు కొనటానికి ప్రయత్నించిన విమానాన్ని మోడీ ప్రభుత్వం1600 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనిల్ అంబానీ కంపెనీకి విమాన ఉత్పత్తి రంగంలో ఎటువంటి అనుభవం లేదు. ఏ కంపెనీకైతే రాఫెల్ డీల్ ఇచ్చారో ఆ కంపెనీ దాదాపు 35 ,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఆర్డర్ ఇవ్వటానికి పది రోజులముందే ఆ కంపెనీని స్థాపించారు.

రాఫెల్ యుద్ధ విమానాలు ఒక పెద్ద స్కాం అన్న రాహుల్ ఈ కుంభకోణంలో అనిల్ అంబానీ కోసం మోదీ వేల కోట్లు దాచి పెట్టారని వెల్లడించారు. రాఫెల్ డీల్ గురించి అడిగితే అది రక్షణ వ్యవహారమని హోమ్ మినిస్టర్ అంటారు. ఫ్రాన్స్ సంస్థతో సీక్రెట్ ఒప్పందం అంటారు. నేను స్వయంగా ఫ్రాన్స్ రాష్ట్రపతిని ఈ విషయం గురించి అడిగితే అలాంటి సీక్రెట్ ఒప్పందం లేదని అన్నారు.

ఫ్రాన్స్ రాఫెల్ ధరను దాచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పినా మోదీ ఎందుకు దాస్తున్నారు? దేశ యుద్ధ విమానాల కొనుగోలు గురించి దేశ ప్రజలకు తెలియటం రక్షణ వ్యవహారం ఏంటి. దీని గురించి తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. లక్షలమంది నిరుద్యోగులకు ఈ రాఫెల్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఉదోగాలకు మోడీ గండి కొట్టారు. ఇదివరకు దీనిని అవినీతి అనేవారు ఇప్పుడు రీడిజైన్ అంటున్నారు.

తెలంగాణాలో కూడా మీ ముఖ్యమంత్రి రీడిజైన్ స్పెషలిస్ట్. పేద రైతుల దగ్గర భూమిని లాక్కుంటున్నారు. అంబేద్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడితే దాన్ని పక్కన పెట్టేసి రీడిజైన్ చేస్తున్నారు. 25 ,000 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాణహితకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రీడిజైన్(అవినీతి) చేస్తున్నారు. ఈ రీడిజైనింగ్ వలన ఒక్కసారిగా 38,000 కోట్లు అనుకున్న ప్రాజెక్టు లక్ష కోట్లకు వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్టుల పేరు మీద జరుగుతున్న అవినీతితో ఒకే కుటుంబానికి డబ్బులు చేరిపోయాయి. రీడిజైనింగ్ పేరుతో మోడీ, కెసిఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక రీడిజైనర్ మరొక రీడిజైనర్ ని సపోర్ట్ చేస్తాడు.

మోడీ ఎలా చేస్తే కెసిఆర్ కూడా అలానే చేస్తున్నాడు. గతంలో తెలంగాణాలో కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఫ్రీ. కానీ ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో స్కూలు ఫీజులు ఎక్కువయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక ఫీజుల వలనఇబ్బంది పడుతున్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే బీజేపీ నేతలు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోరని వ్యక్తం చేశారు. ఈ నినాదం చేసేటప్పుడు మహిళలు ఎవరి నుండి రక్షించబడాలి అనేది చెప్పరు మోడీ. బేటీ బచావో బీజేపీ ఎమ్మెల్యేసే బేటీ బచావో అని నినదించారు రాహుల్. గబ్బర్ సింగ్ టాక్స్ (జీఎస్టీ) లక్ష్యం పేదల నుండి, రైతులనుండి దోచిన ధనం సంపన్నులకు దోచిపెట్టడానికే అన్నారు రాహుల్.

ఎవరైతే క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పోరాడతారో వారికే ప్రజా ప్రతినిధులుగా టిక్కెట్లు ఇస్తానని తెలిపారు. మోదీలాగా తప్పుడు హామీలు ఇవ్వటానికి నేను రాలేదని తెలిపారు. తెలంగాణ కోసం మీరు కన్నా కలలు సాకారం చేస్తానని చెప్పటానికే వచ్చాను అని స్పష్టం చేశారు.