బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది! ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం నేరపూరిత చరిత్ర ఉన్నారనే ఆరోపణలతో పార్లమెంట్ రాహుల్ పై అనర్హత వేటు విధించింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా అన్నిపార్టీలు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో… బీజేపీ తొందరపడిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్షాల ఐక్యతకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందనే విశ్ళేషణలూ తెరపైకి వస్తున్నాయి. అవన్నీ ఒకెత్తైతే… తాజాగా దేశవ్యాప్తంగా చర్చలోకి వస్తున్న ప్రశ్న… “బీజేపీలో ఉన్నవారంతా పత్తిత్తులేనా..?” అని!
అవును… కేవలం ఒక ఇంటిపేరు ఉదాహరణగా చూపించినందుకే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసి, రెండేళ్లు జైలు శిక్ష వేసి, ఎంపీగా అనర్హత వేటు వేసి, ఊకడంపుడు ఉపన్యాశాల్తో విమర్శించి.. ఇంత చేశారు. మరి బీజేపీలో ఉంటూ మత విద్వేష వ్యాఖ్యలు చేసే సాధ్వి లాంటి వారి సంగతేంటి? పార్లెమెంటులో రాహుల్ మినహా ఉన్నవారంతా ఒక్కకేసు కూడా లేనివాళ్లేనా? బీజేపీలో ఉన్న ఎంపీల్లో ఎంతమంది శ్రీకృష్ణజన్మస్థలాన్ని చూసిన అనుభవం కలిగిలేరు? అని ఆన్ లైన్ వేదికగా ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఇదే క్రమంలో బీజేపీ ఉన్నంతమంది ఆర్థిక నేరగాళ్లు… మరేపార్టీలోనూ లేరనే కామెంట్లు కూడా ఆన్ లైన్ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీలో చేరిపోయి.. ఈడీ విచారణలు – సీబీఐ విచారణలనుంచి తప్పించుకున్న ఎంతోమంది నేతల ఫోటోలు ప్రచురిస్తూ… బీఆరెస్స్ విమర్శల వర్షాలు కురిపించిన సంగతి తెలిసిందే!
దీంతో… పార్టీలకతీతంగా నాయకులతో పాటు, సామాన్య జనానికి కూడా బీజేపీ చేస్తున్నది అతి అనే విషయం అర్థమవుతోంది. అనర్హత విషయానికొస్తే… మతాన్ని అడ్డు పెట్టుకుని సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ముందుగా వేటు వేయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా మొదలవుతున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… రాహుల్ పై అనర్హత వేటువేసి బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని.
ఎందుకంటే… గుజరాత్ లోని సూరత్ కోర్ట్ విధించిన శిక్ష విషయంలో రాహుల్, పై కోర్టులకు అప్పీల్ కి వెళ్లే అవకాశముంది. అక్కడ శిక్షను తగ్గించినా, రద్దు చేసినా ఆయనపై అనర్హత పడే అవకాశముండదు. ఈలోగా హడావిడిగా లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకోవడం, వయనాడ్ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు ప్రకటించడం కచ్చితంగా తొందరపాటు చర్య అని.. ఇది బీజేపీ వేసుకున సెల్ఫ్ గోల్ అని అంటున్నారు విశ్లేషకులు!