గత బుధవారం నాడు జమ్ముకాశ్మీర్ లోని పుల్వామాలో 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్ల మృతి కి కారణమయిన ఆత్మాహుతి దాడి వెనక ఉన్న కీలకమయిన తీవ్రవాదిని భారత భద్రతా దళాలు ఖతం చేశాయి. సోమవారం ఉదయం పింగ్లాన్ వద్ద జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో ఈ తీవ్రవాది అబ్దుల్ రషీద్ ఘాజి హతమయినట్లు తెలిసింది. ఇదే ఎన్ కౌంటర్లో ఒక ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు కూడా చనిపోయారని తెలిసింది. పింగ్లాన్ కూడా పుల్వామా జిల్లాలోనే ఉంటుంది.
మీడియా రిపోర్టుల ప్రకారం ఫిబ్రవర 14 సిఆర్ పి ఎప్ కాన్వాయ్ మీద దాడి చేసిన అదిల్ అహ్మద్ దార్ కు తీవ్రవాద దాడుల్లో శిక్షణ ఇచ్చింది అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్ యే. ఇటీవలి కాలంలో భారతీ భద్రతా దళాల మీద జరిగిన దాడులకు కూడా ఘాజీ యే సూత్రధారి.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన భారతీయులు మేజర్ విఎస్ దౌండియాల్ (డెహ్రూడూన్ ), హవల్దార్ షియోరామ్ (ఝంఝును), సిపాయ్ అజయ్ కుమార్ (మీరట్ ) సిపాయ్ హరిసింగ్ ( రేవడి) వీళ్లంతా ఈ రోజులో ప్రధాన పాత్ర వహించిన 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వారు.