టెన్నిస్ తార సానియా మీర్జా గత నెలలో తల్లి అయిన సంగతి తెలిసిందే. సానియ, భర్త షోయబ్ మాలిక్ కుటుంబాల పేర్లు కలిసేలా బాబుకి ఇజాన్ మీర్జా మాలిక్ అని పేరు పెట్టారు. తల్లితండ్రులయిన ఆనందాన్ని సానియా దంపతులు ఇపుడు ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారు.తన నూతన మాతృత్వం అనుభవాన్ని ఒక అందమయిన, అరుదైన ఫోటో ‘మధుర క్షణాలు’ అంటూ ట్విట్టర్ , ఇన్ స్టా గ్రా మ్ లలో షేర్ చేశారు. బాబుకు కప్పిన వస్త్రం మీద ఇజాన్ అని మురిపెంగా రాసి ఉంది.బాబును వోలలాడిస్తున్నట్లున్న ఈ పోటో సోషల్ మీడియాలో వైరలయింది.