ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీలో కాలు పెట్టకుండా అడ్డుకుని తీరుతామని ఉస్మానియా విద్యార్థి జెఎసి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ గన్ పార్కు వద్ద ముక్కు నేలకు రాసిన తర్వాతే ఉస్మానియాలో కాలు పెట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ కొర్రీలు పెట్టిందని ఆరోపించారు.
ఉస్మానియాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో బాలరాజు యాదవ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట ధర్నా చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. బాలరాజు యాదవ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.