ఉత్తరప్రదేశ్లో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసి ఆ తర్వాత డాక్టర్లు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా డాక్టర్లను ప్రత్యేక దైవాలుగా ప్రజలందరూ భావిస్తారు. ప్రాణాపాయంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లను దేవుడితో సమానంగా గౌరవిస్తారు. ఇలా సమాజంలో డాక్టర్ వృత్తికి ఎంతో గౌరవం ఉంది. అయితే ఇలా ఒక గౌరవమైన వృత్తిలో ఉంటూ కొంతమంది డాక్టర్లు వారు చేసే పని పట్ల నిబద్ధత లేకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో కూడా ఇటువంటి దారుణ సంఘటన ఒకటే చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..ఉత్తరప్రదేశ్ కు చెందిన నజ్రానా అనే 9 నెలల గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో బాధపడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకి తీయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీసి , ఆ తర్వాత స్త్రీ ఫోటోలు టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేశారు.ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా మహిళకు తీవ్రమైన కడుపునొప్పి ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ని సంప్రదించారు.

అయితే చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా కడుపునొప్పి ఉంటుందని కుటుంబ సభ్యులకు సర్ది చెప్పాడు. అయితే ఆమెకు కడుపునొప్పి మరింత తీవ్రంగా పెరగటంతో ఆమె కుటుంబ సభ్యులు మరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేసి పరిశీలించగా కడుపులో టవల్ ఉన్న విషయం బయటపడింది. దీంతో డాక్టర్లు వెంటనే స్పందించి ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న టవల్ బయటికి తీశారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇలా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ మీద ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.