5 లీటర్ల బీరు తాపించి ప్రాణం పోశారు

మద్యం అలవాటు ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. అతిగా మద్యం తాగితే ప్రాణాలు పోతాయని తాగొద్దని చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఆ మద్యమే ప్రాణాలను నిలిపింది. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.

వియత్నాంకు చెందిన గుయెన్ నాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం వియత్నాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుయెన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మిథనాల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందని నిర్ధారించారు. దాంతో అతని లివర్ పాడైందని తెలిపారు. ఈ మిథనాల్ కంట్రోల్ చేయాలంటే ఇథనాల్ ను శరీరంలోకి పంపించాలి. బీర్లలో ఇథనాల్ అధికంగా ఉంటుంది కాబట్టి వెంటనే వైద్యులు గుయెన్ బాడీలోకి 5 లీటర్ల బీరును ఇంజక్ట్ చేశారు. దీంతో మిథనాల్ లెవల్స్ సాధారణ స్థాయికి వచ్చాయి. 

ఆ తర్వాత గుయెన్ లివర్ ను క్లీన్ చేసి శస్త్రచికిత్సలు చేశారు. దీంతో గుయెన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగు పడుతోంది. గుయెన్ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని మూడు వారాల తర్వాత అతనిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.