రోడ్డుకి రెండువైపులా కాలువ ఉంది. వరద ఉధృతికి వంతెనపైనుండి నీళ్లు అవతలివైపుకి ప్రవహిస్తున్నాయి. అది గమనించిన వాహనదారులు ముందే తమ వాహనాలను నిలిపివేసుకుని ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం కళ్ళ ముందే నీటి ప్రవాహం మొదలైనా ఏమి కాదనుకున్నాడో ఏమో బైక్ స్టార్ట్ చేసి వంతెన దాటబోయాడు. ఇంతలోనే కాలువ పోటెత్తింది. వంతెన దాటకుండానే సదరు వ్యక్తి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.