నాగుపామును పట్టుకుంటుంటే కాటేసింది… అదృష్టంతో బతికిండు (లైవ్ వీడియో)

నాగుపామును చూస్తేనే ఎవరైనా భయపడుతారు. అటువంటి పామును పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి పాముకాటుకు గురయ్యాడు. అయినప్పటికి కూడా అతను అదృష్టంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఈ సంఘటన ఒడిశాలోని కోరాపూట్ జిల్లా సునాబేడాలో జరిగింది. ఆ వీడియో కింద ఉంది చూడండి. లింక్  పై క్లిక్  చేస్తే వీడియో వస్తుంది.

 

https://www.youtube.com/watch?v=RLDmUvx7y6Y

సునాబేడాలో ఓ ఇంటికి నాగుపాము వచ్చింది. దీంతో వారు వెంటనే పాములను పట్టుకునే సుకుమార్ మమానాదియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన సుకుమార్ ఓ చేత్తో పాము తోకను పట్టుకొని మరో చేత్తో చేతిలో ఉన్న ఇనుపరాడ్ ను దాని తల పై పెట్టెందుకు ప్రయత్రించాడు. ఆ సమయంలో పాము అతని చేతి పై కాటు వేసింది. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిచారు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత స్నేక్ హెల్పర్ వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలేశారు.