పీఎం మోదీతో పలు అంశాల మీద చర్చల తర్వాత ముగిసిన కేసీఆర్ భేటీ !

kcr meeting with the PM and is reported to have discussed all pending issues with the Centre.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు.కేసీఆర్ నిన్నటి నుంచి పలువురు కేంద్రమంత్రులను కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన నిధులపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

kcr meeting with the PM and is reported to have discussed all pending issues with the Centre.
kcr meeting with the PM and is reported to have discussed all pending issues with the Centre

శుక్రవారం హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయి.. వరద సాయం నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కూడా సమావేశయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే శనివారం (డిసెంబరు 12) కేంద్ర మంత్రి హార్దీప్‌సింగ్ పురీతో సీఎం కేసీఆర్ సమావేశమై తెలంగాణhttps://telugurajyam.com/tag/Telanganaలో 6 ఎయిర్‌పోర్టులకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అంతేకాక ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ఆయనకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.