మందు సరిపోలేదని విమానంలో రచ్చరచ్చ చేసిన మహిళా (వీడియో)

అప్పటికే ఆ ఐరిష్ మహిళా ఫుల్ గా మద్యం సేవించింది. అయినా కూడా తనకు మందు సరిపోలేదని తనకు ఇంకా మద్యం కావాలని ఎయిర్‌ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో నానా రభస చేసింది. సిబ్బందిని చెప్పరాని భాషల తిట్టింది. పైలెట్ క్యాబిన్ దగ్గరకు వెళ్లి వారి మీద ఉమ్మింది. అయినా కూడా వారు ప్రశాంతంగానే ఉన్నారు.

అప్పటికే మహిళ ఫుల్ అవడంతో క్యాబిన్ క్రూ పైలెట్ కు విషయం చెప్పాడు. ఆమెకు మందు ఇవ్వవద్దని పైలెట్ క్రూను ఆదేశించారు. దీంతో ఆ మహిళ రెచ్చిపోయి గాలిలో ఉన్న విమానంలోనే రచ్చ రచ్చ చేసింది. ఆమె గమ్య స్థానం లండన్ చేరగానే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మహిళ హంగామా చేసిన వీడియో కింద ఉంది చూడండి. 

 

https://twitter.com/twitter/statuses/1062356754636423168