ప్రయాణికులకు విజ్ఞప్తి:ట్రైన్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాలకు ముందు కూడా టికెట్ క్యాన్సిల్ చేస్కొవచ్చును

indian railways brought the new rule of cancel the ticket even 5 mins before train leaves

దేశంలో కరోనా విలయతాండవం గురించి చెప్పేదేముంది. కరోనా వలన అనేక విధాలుగా ప్రజలకి , దేశానికి కూడా నష్టం కలిగింది.అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యకలాపాలన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. అన్ లొక్డౌన్ మొదలయ్యాక కొన్ని ట్రైన్స్ ని ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రజలు ట్రైన్ జర్నీఅన్నదే మానేశారు. ఆ మాటకు వస్తే.. ప్రయాణాలే తగ్గిపోయాయి. కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. నెలల తరబడి ఇళ్లకే పరిమితవుతున్న వారు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో రైలు బండ్లు కూడా ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాల్ని తీసుకొస్తోంది రైల్వే శాఖ.

secunderabad railway station

అందులో భాగంగానే ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ సౌకర్యాన్నికల్పిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ట్రైన్ బయలుదేరటానికి అరగంట ముందు రెండో చార్ట్ ప్రిపేర్ చేస్తారు. రైలు కదలటానికి ఐదు నిమిషాల ముందు వరకు రిజర్వేషన్ టికెట్లను విక్రయిస్తారు. అదే సమయంలో.. ట్రైన్ కదలటానికి ఐదు నిమిషాల ముందు వరకు టికెట్ ను రద్దు చేయటానికి వెసులుబాటు కల్పించనున్నారు.

ఈ కొత్త సౌకర్యాన్నిశనివారం నుంచి అమల్లోకి తీసుకు రావటం జరిగింది. రైలు బయలుదేరటానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ టికెట్ ను రద్దు చేసుకునే వీలుంది. తర్వాత రద్దు చేసుకున్నా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు వరకు టికెట్ ను రద్దు చేసుకునే వీలు కల్పిస్తున్నారు