ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కి కేంద్రం వచ్చేవారం అనుమతి !

china released corona vaccine last month

ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరుణంలో మన దేశంలో ఎప్పుడు అనుమతులు ఇస్తారు అని అంతా ఎదురుచూస్తున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే… ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ‌కి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ వాడకానికి వచ్చే వారం అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

ఈ వ్యాక్సిన్‌ ని ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ ఇండియా… అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దీన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని… రెండు వర్గాల నుంచి తమకు నమ్మదగిన సమాచారం వచ్చిందని రాయిటర్స్ తెలిపింది. ఈ అనుమతి ఇస్తే గనక… బ్రిటన్‌లో తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‌కి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా ఇండియా మారనుంది.

మరోవైపు ఈ వ్యాక్సిన్‌ ను బ్రిటన్ డ్రగ్ రెగ్యులేటరీ అధికారులు కూడా మదటి నుంచి పరిశీలిస్తూనే ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ లాగే అమెరికా కంపెనీ ఫైజర్ (Pfizer), భారత కంపెనీ భారత్ బయోటెక్ కూడా తమ వ్యక్సిన్ల ఎమర్జెన్సీ వాడకానికి అప్లికేషన్లు పెట్టుకున్నాయి. కేంద్రం ఇంకా దేనికీ అనుమతి ఇవ్వలేదు.