తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తమ పిల్లల క్షేమం కోసం ఆరాటపడతారు. అయితే కొన్ని సందర్భాలలో విధిరాత వల్ల తల్లి చనిపోవడంతో పిల్లల బాధ్యత ఆ తండ్రి మీద ఉంటుంది. తల్లి లేని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రులు కొంతమంది తమ పిల్లల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి లేని పిల్లల అవసరాలు తీర్చవలసిన తండ్రి భార్య చనిపోయిన నాలుగు నెలలకి కూతురు మీద కన్నేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే..బీహార్ పూర్నియాలోని అరారియా ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల 4 నెలల క్రితం భార్య మరణించటంతో అప్పటినుండి పిల్లల బాధ్యత తానే తీసుకున్నాడు. భార్య చనిపోయిన తర్వాత తన ఏడేళ్ల కూతురి మీద ఆ తండ్రి కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నా కూతురన్న కనికరం కూడా లేకుండా బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని బెదిరించాడు.దీంతో బాలిక భయపడి విషయం ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టింది.
ఇదే అదనుగా భావించిన ఆ తండ్రి తరచూ తన కూతురిపై పాల్పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో తండ్రి ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ చిన్నారి తండ్రి ఇంట్లో లేని సమయంలో ఇంటి నుండి పారిపోయి వచ్చింది. సమీపంలోని రైల్వే స్టేషన్ లో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ కూర్చున్న ఆ బాలికను గమనించిన స్థానికులు దగ్గరికి వెళ్లి విషయం ఏమిటని అడిగారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయం స్థానికులతో వివరించింది. ఆ చిన్నారి మాటలు విన్న స్థానికులకు ఆమె తండ్రి మీద తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఎలాగైనా చిన్నారిని కాపాడాలన్న ఉద్దేశంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. అదే సమయంలో ఆ తండ్రి చిన్నారిని వెతుక్కుంటూ అక్కడికి రావడంతో స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. చిన్నారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.