సంక్రాతి కానుక కోసం భార్యను చంపిన భర్త

ప్రభుత్వం ఇచ్చిన సంక్రాతి కానుక భార్య చావుకు కారణమైంది. రూ.500 కోసం ఆలుమగల మధ్య పంచాయితీ ఏర్పడింది. చివరకు అది భార్య హత్యకు దారితీసింది.

తమిళనాడు ప్రభుత్వం పొంగల్ బోనస్ ప్రకటించింది. తమిళనాడులోని మధురై జిల్లా ఏళుమలై గ్రామానికి చెందిన రాజమ్మాళ్, రామర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో అంతా వేర్వేరుగా ఉంటున్నారు. రామర్ గ్రామంలోనే ఉంటుండగా రాజమ్మల్ కేరళలో వ్యవసాయ పనులు చేసుకుంటూ బతుకుతుంది. రాజమ్మల్ సంక్రాంతి పండుగ కోసం కేరళ నుంచి గ్రామానికి వచ్చింది.

తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగకు ఇచ్చిన 1000 రూపాయల కానుక, రేషన్ సరుకులు తీసుకు వచ్చింది. పని లేకుండా ఖాళీగా ఉండే రామర్ గ్రామంలో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 1000రూపాయలను ఇవ్వాలని రాజమ్మల్ తో గొడవకు దిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. కోపంతో కత్తి తీసుకొని ఆమె మెడను కోశాడు. రాజమ్మల్ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles