న్యూఢిల్లి నోయిడాలో అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 12 లోని మెట్రో ఆస్పత్రిలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో వందలాది మంది రోగులు ఉండడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. 12 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. రోగులను , వారి బంధువులను గ్లాసు డోర్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది బయటికి చేరుస్తున్నారు. అనేక మంది రోగులు లోపల చిక్కుకోవడంతో ఆందోళన నెలకొంది.