కేరళలో రక్షించటానికి వస్తే సెల్ఫీ మోజులో ఏం చేశాడో చూడండి

కేరళ వరద బాధితులను కాపాడటానికి సైన్యం ముప్ప తిప్పలు పడుతుంటే ఒక ఆకతాయి చేసిన పని విస్మయానికి గురి చేసేలా ఉంది. వరదల కారణంగా కేరళ ప్రజలు లబోదిబోమని ఏడుస్తుంటే అతగాడు మాత్రం సెల్ఫీ మోజులో నుండి బయటకు రానట్టున్నాడు. సెల్ఫీ తీసుకోవటం కోసం సహాయక చర్యలు చేపడుతున్న సైన్యానికి కూడా చిరాకు తెప్పించే పని చేశాడు.

హెలికాప్టర్ ద్వారా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక బృందం. ఒక పోకిరీ కింద నుండి రెడ్ కలర్ టీషీర్ట్ ఊపుతూ నేను ప్రమాదంలో ఉన్నాను కాపాడమంటూ కేకలు పెడుతూ కనిపించాడు. దీంతో అతన్ని రక్షించడానికి పైలట్ అతి కష్టంతో హెలికాప్టర్ ని అతని సమీపంలోకి తీసుకొచ్చాడు. హెలికాప్టర్ అతని దగ్గరకు వెళ్ళగానే పాకెట్ నుండి మొబైల్ బయటకు తీసి సెల్ఫీ తీసుకుని వారిని వెళ్లిపొమ్మన్నాడు. అతని ఈ చర్యకు ఖంగు తిన్నారు సైనికులు. ఈ విషయాన్ని స్వయంగా వరద బాధితులను రక్షిస్తున్న పైలట్ తెలిపారు.