ఇంత నిర్ల‌క్ష్యమా?.. ఆసుప‌త్రిలో మ‌హిళా శవాన్ని పీక్కుతింటున్న కుక్క‌, ప‌ట్టించుకోని సిబ్బంది- వీడియో

ఆసుప‌త్రిలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌నలు చాలా హృద‌య‌విదార‌కంగా ఉంటాయి. తాజాగా ఓ మ‌హిళ మృతదేహాన్ని కుక్క తినేస్తున్న సంఘ‌ట‌న బ‌య‌ట‌కు రాగా, దీనిని చూసి అంద‌రు చ‌లించిపోతున్నారు. వివరాల‌లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. పోస్ట్‌మార్టం కోసం బాలిక‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. అయితే ఆ శ‌వాన్ని స్ట్రెచ‌ర్‌పైనే ఉంచి వ‌రండాలో వ‌దిలేశారు. దాదాపు నాలుగు గంట‌ల పాటు శవం అక్క‌డే ఉండ‌డం, బాడీ నుండి రక్తం కారుతుండంతో అటుగా వెళుతున్న కుక్క శవాన్ని ఓ వైపు కొరికి తినేసింది

మ‌హిళా శవాన్ని కొరికి తింటున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఆసుప‌త్రికి వ‌చ్చే వారి ప‌ట్ల సిబ్బంది ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటున్నారంటూ ఆవేద‌న తెలియ‌జేశాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ కావ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మీద‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులపై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. మ‌నుషుల ప‌ట్ల ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ మండిప‌డుతున్నారు.

ఈ విష‌యంపై ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి అమితా సింగ్ విచారణకు ఆదేశించామని స్థానిక మీడియాకు చెప్పారు. కాని బాధిత త‌ల్లితండ్రులు నా అమ్మాయి శ‌వాన్ని కుక్క‌ల పాలు చేశారా అంటూ మండిప‌డుతున్నారు. ఇలాంటి సంఘట‌న‌లు అంత‌టా రోజుకి కొన్నివేల సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయిన ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు అంటూ దిగులు చెందుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టికైన ప్ర‌భుత్వాలు ఇలాంటి విష‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని కోరుతున్నారు.