ఐఫోన్ ప్లాంట్ లో ఉద్యోగుల విధ్వంసం.. 132 మంది అరెస్ట్ !

కర్ణాటక లోని ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఉద్యోగులు విధ్వంసం సృష్టించారు. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఈ ప్లాంట్ ఉంది. జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారు. ఈ ఘటనకు కారణమైన కనీసం 132 ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Disgruntled employees vandalise Wistron Corp's iPhone manufacturing plant  in Kolar | The News Minute

ఈ ప్లాంట్ ను తైవాన్ కు చెందిన టెక్ దిక్కజం విస్ట్రన్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో పని చేసేందుకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు ప్లాంటుకు వచ్చారు. జీతాలు ఇంకా చెల్లించలేదనే ఆగ్రహంతో ప్లాంట్ పై దాడి చేశారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు కూడా పెట్టారు.

మరోవైపు కొందరు ఉద్యోగులు తమ ఫోన్లతో తీసిన వీడియోలలో పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి. అయితే, ఈ హింసపై ఇంత వరకు విస్ట్రన్ కార్పొరేషన్ స్పందించలేదు. నర్సాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉంది. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.