కర్ణాటక శాసనమండలి లో రచ్చ .. వీడియో వైరల్

కర్ణాటక శాసనమండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మండలి డిప్యూటీ చైర్మన్‌ భోజెగౌడను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. ఆయనకు చైర్‌లో ఉండే అర్హత లేదంటూ మూకుమ్మడిగా కిందకు దింపారు. దీంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బీజేపీ మండలి ఛైర్మన్‌ కె. ప్రతాపచంద్ర శెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.ర్హత లేదంటూ మూకుమ్మడిగా కిందకు దింపారు. దీంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. గోవధ నిషేధ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కొంత మంది సభ్యులు గుండాల్లా ప్రవర్తించారని బీజేపీ ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా మండిపడ్డారు. మండలి వైస్ ఛైర్మన్‌ను కుర్చీలో నుంచి లాగేశారని తెలిపారు. ‘మండలి చరిత్రలో ఇలా సిగ్గుతో తల దించుకోవాల్సిన చర్య ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటన పట్ల మేం చాలా సిగ్గుపడుతున్నాం. ప్రజలు ఏమనుకుంటారు అనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

https://twitter.com/ANI/status/1338736257812197377