రేప్ కేసులో మంత్రికి బాసటగా డిప్యూటీ సీఎం

దేశమంతటా సంచలనం సృష్టించిన రేప్ కేసులో మంత్రికి బాసటగా నిలిచారు డిప్యూటీ సీఎం. బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో విపక్షాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మంజు వర్మ. ఈమెకు మద్దతు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. బీజేపీ ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో 34 మంది యువతులపై లైంగిక దాడులు జరిగిన ఘటనలో జేడీయూ నేత మంజువర్మ హస్తం ఉందంటూ ఆర్జేడీతో పాటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమె భర్త చంద్రశేఖర్ వర్మ షెల్టర్ హోంకి తరచు వెళ్తుంటారని విపక్షాల ఆరోపణ. ఈ తరుణంలో ఆమెకు మద్దతు తెలిపారు ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. “ఆమెకు బీజేపీ నుండి పూర్తిగా మద్దతు ఉంది. తనపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. రైల్వే టెండర్ స్కాం లో ఛార్జ్ షీట్ దాఖలయ్యి, సమన్లు అందుకుని, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ జఫ్తులో 2 డజన్ల బినామీ ఆస్తులు చిక్కుకున్నవారు నైతిక విలువల గురించి చెప్పక్కర్లేదు అంటూ ట్విట్టర్లో తేజస్వి యాదవ్ ని ఉద్దేశించి దెప్పి పొడిచారు.

 

 

విశేషం ఏంటంటే ఈ కేసులో మంజు వర్మ రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత సీపీ ఠాకూర్ కూడా కోరారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన సిగ్గు చేటు అంటూ, దోషుల్ని వదిలిపెట్టమని స్పష్టం చేసారు. ఇక విపక్షాల ఆరోపణలకు మంజు వర్మ కూడా ధీటుగా సమాధానం చెబుతున్నారు. నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని వెల్లడించారు. ఒకవేళ ఆయన తప్పు చేసినట్టు రుజువైతే నది రోడ్డుపైన ఉరి తీయమంటూ ఛాలెంజ్ చేసారు.