దర్శన్ పై దాఖలైన అదనపు ఛార్జ్ షీట్.. మరింత ఇరకాటంలో పడబోతున్న కన్నడ స్టార్ హీరో!

తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పితో బాధపడుతున్న దర్శన్ కి వైద్య చికిత్స కోసం కొన్ని షరతులు విధిస్తూ ఆరువారాలపాటు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. ప్రస్తుతం దర్శన్ బెంగళూరులోని బి జి ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతను హైపర్ టెన్షన్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు సమాచారం అందుకే ఆపరేషన్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అతను మానసికంగా శాస్త్ర చికిత్సకు సిద్ధంగా లేడని, అధిక రక్తపోటు వాయిదాకు పెద్ద అవరోధంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు దర్శన్ మెడికల్ రిపోర్టు అతని తరుపు న్యాయవాది నగేష్ కోర్టుకు సమర్పించారు. అయితే ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగళూరు పోలీసులు ఇక్కడితో ఆగడం లేదు.

మధ్యంతర బెయిల్ పై ఉన్న దర్శన్ పై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లబోతున్నారు. అతని మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని వాదించబోతున్నారు. తొలి విడతగా దాదాపు 3 వేల పేజీలతో భారీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు ఇప్పుడు 1300 పేజీలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. దీంతో దర్శన్ పరిస్థితి మరింత ఇరకాటంలో పడినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ చార్జి షీట్ లో ఫోటో సాక్ష్యాలు ఉన్నాయి.

దాంతోపాటు ఇతర నిందితులు వాడిన కారు, ఫోటోలు మరో 30 మంది సాక్షుల వాంగ్మూలాలు కలిపి దాదాపు 40 కి పైగా సాక్షాదారాల్ని ఇందులో సమర్పించబోతున్నారు. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 26 న జరగబోతుంది. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు మరొక 15 మంది నిందితులు అరెస్టు అయిన విషయం తెలిసిందే అందులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా ఉన్నారు. అయితే అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం వలన దర్శన్ మరింత ఇరకాటంలో పడే ఛాన్స్ ఉంది, ఇప్పటికే దర్శన్ బెయిల్ విచారణలో హైకోర్టు మరొక వాయిదా అని ప్రకటించడం గమనార్హం.