బ్రేకింగ్ న్యూస్: హర్దిక్ పటేల్‌కు జైలు శిక్ష

పటేల్ ఉద్యమంతో దేశం దృష్టిని ఆకర్షించిన నేత హార్దిక్ పటేల్. గుజరాత్ లోని పటేల్ వర్గానికి చెందిన వారికి ఓబీసీ కేటగిరి కింద  రిజర్వేషన్లు కల్పించాలని పోరాడాడు. చిన్న  వయసులోనే పోరాడి దేశమంతా పేరు సంపాదించాడు. మరికొన్ని విమర్శలు కూడా ముటగట్టుకున్నాడు. హార్దిక్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు  కోర్టు తీర్పు చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ లోని  పటేల్ ఉద్యమదారుల నేత హార్దిక్ పటేల్ కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ లోని స్థానిక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీనితో పాటు రూ. 50 వేల జరిమానా విధించాలని కోర్టు తీర్పునిచ్చింది. హార్ధిక్ పటేల్ గుజరాత్ లోని పటేల్ దారులందరికి  విద్యా, ఉద్యోగాల్లో ఓబిసి కేటగిరి కింద రిజర్వేషన్లు కల్పించాలని 2015 లో ఉద్యమం చేసి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాడు. 2015లో పటీదార్ ఆందోళన సందర్భంగా విస్ నగర్ లోని బిజెపి ఎమ్మెల్యే రుషికేశ్ పటేల్ కార్యాలయంలో విధ్వంసం చోటు చేసుకుంది. ఈ కేసులో పటీదార్ అనామత్ ఆందోళన సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ను విస్ నగర్ న్యాయస్థానం దోషిగా తేల్చింది.

కోర్టు తీర్పు వెలువడగానే హార్దిక్ తన తరపు న్యాయవాదులతో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తున్నది. హార్దిక్ పటేల్ తో పాటు లాల్ జీ పటేల్, అంబాలాల్  పటేల్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చి వారికి కూడా రూ. 50వేల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పటేల్ వర్గ సమస్యలపై ఉద్యమించిన హార్దిక్ పటేల్ దేశం దృష్టిని ఆకర్షించాడు.