కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం ముద్రా యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు ఆర్థిక చేయూత లభించనుంది. ఈ స్కీమ్ ద్వారా బిజినెస్ ను మరింత విస్తరించుకోవాలని భావించే వాళ్లు సైతం సులువుగా రుణం పొందవచ్చు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది.
కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆర్.ఆర్.బీలు ఈ తరహా స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఎంట్రప్రెన్యూర్లకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ అమలవుతుండగా https://www.mudra.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్స్ లో మూడు విభాగాలు ఉండగా శిశు, కిశోర్, తరుణ్ అనే పేర్లతో ఈ మూడు విభాగాలు ఉంటాయి. శిశు విభాగం కింద రుణం తీసుకున్న వాళ్లు 50,000 రూపాయల కంటే తక్కువ మొత్తం రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. 50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల లోపు రుణాలను కిషోర్ విభాగంలో భాగంగా తీసుకోవచ్చు. 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల లోపు రుణాలు తరుణ్ విభాగం కిందకు వస్తాయి.
సమీపంలోని బ్యాంకును సంప్రదించడం లేదా ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.udyamimitra.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ స్టేట్మెంట్, జీఎస్టీ నంబర్, పాన్ కార్డ్ ఆధారంగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.