మహిళల యూరిన్‌తో బ్రెడ్ తయారు చేస్తున్నారు..ఎందుకో తెలుసా..?

గోమూత్రంలో పోషకాలు ఉంటాయనేది కొందరి నమ్మకం. అందుకే దాన్ని సేవిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే విషయం వింటే మీకు దిమ్మతిరగడం ఖాయం. మహిళల యూరిన్‌తో బ్రెడ్ తయారు చేస్తున్నారు. అవును ఇది నిజం. ఫ్రాన్స్‌లోని ఓ బేకరీ ఓ తమ సొంత ఉత్పత్తులైన ‘గోల్డిలాక్స్‌ బ్రెడ్‌’ తయారీ కోసం పబ్లిక్‌ టాయిలెట్స్‌ నుంచి మహిళల యూరిన్ సేకరిస్తున్నారు. తనను తాను ‘ఎకో-ఫెమినిస్ట్’గా చెప్పుకునే ఈ లూయిస్‌ రాగెట్‌ అనే మహిళా వ్యాపారి సేకరించిన విమెన్ యూరిన్‌ను బ్రెడ్‌ తయారీకి ఉపయోగించే గోధుమలను ఫెర్టిలైజ్‌ చేసేందుకు ఉపయోగిస్తుందట. మహిళల మూత్రం మంచి ఎరువు అని ఆమె గట్టగా వాదిస్తుంది కూడా. ఈ మాట వింటేనే కడుపులో దేవుతుంది కదా..కానీ ఆమె మాత్రం స్థిరమైన ఆహార చక్రం క్రియేట్ చెయ్యడమే తన లక్ష్యమని చెబుతోంది.

ఆమె బేకింగ్ ప్రక్రియ కొంత కష్టమైనా మీకు తెలుసుకోవాలని ఉంది కదూ !. మహిళల రెస్ట్‌ రూంల నుంచి మూత్రాన్ని సేకరించి..అనంతరం శుద్ది చేసి గోధుమలపై పిచికారీ చేస్తుంది లూయిస్‌. ‘ఇది అంటరానిదిగా చెప్తారు.. వ్యర్థంగా చూస్తారు. కానీ, దీని ఒక బంగారు గణిలా పరిగణించాలి’ అని అంటోంది రాగెట్‌. మూత్రంలో నైట్రోజన్, పొటాషియం తదితర ఎన్నో పోషకాలు ఉన్నాయని చెబుతోంది. ఈ పోషకాలు ఎన్నో ఇండస్ట్రీస్ కష్టపడి భూమి నుంచి సేకరిస్తున్నాయట.. మూత్రం అనేది వేస్ట్‌గా భూమిలో కలిపిపోతుందని, అందులోని చాలా పోషకాలను తిరిగి పొందలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందుకే రసాయన ఎరువులను వాడకం గణనీయంగా పెరిగిందని చెబుతోంది. అయితే మూత్రాన్ని డైరెక్ట్ గా బేకింగ్ లో వాడకుండా, దాన్ని20 సార్లు డైల్యూట్‌ చేసిన తర్వాతే ఎరువుగా ఉపయోగిస్తామని వెల్లడించింది.

ఆమె యూరిన్ గురించి చెబుతోన్న విళ్లేషణలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి కదా. ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ అనాలిసిస్ ప్రకారం.. 29 మిలియన్ల యూరిన్ బ్రెడ్ల తయారు చేయడం ద్వారా ఎవ్రీ డే పరిశ్రమల్లో 703 టన్నుల నైట్రోజన్‌ను సేవ్ చేయొచ్చట. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని డాక్యుమెంట్లను సైతం సిద్దం చేసి..ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు వివరిస్తోంది. ఏమో ఆమె చెప్పింది నిజమైతే త్వరలో ఈ తరహా బ్రెడ్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వొచ్చు. ఆమె పేటెంట్ హక్కు కూడా పొందొచ్చు.