HomeNationalబాలీవుడ్ స్టార్స్ మ‌ధ్య‌..

బాలీవుడ్ స్టార్స్ మ‌ధ్య‌..

బాల‌వుడ్ యంగ్ హీరోస్‌, లేటెస్ట్ స్టార్ హీరోస్ అంద‌రూ గురువారం దేశ రాజ‌ధానిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో భేటీ అయ్యారు. జీఎస్టీ ఇంపోజ్ చేసిన త‌రువాత బాలీవుడ్ ఎదుర్కొంటున్న క‌ష్ట‌, న‌ష్టాల‌ను వారు ప్ర‌ధానికి వివ‌రించారు. విశేషం ఏమిటంటే- ప్ర‌ధానిని క‌లిసిన వారిలో ఎవ‌రూ సీనియ‌ర్లు లేరు. అంద‌రూ ఈ మ‌ధ్య కాలంలో బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చిన వారే.

ఈ సంద‌ర్భంగా వారంద‌రూ ప్ర‌ధానితో ఓ సెల్ఫీ దిగారు. ప్ర‌ధానిని క‌లిసిన వారిలో ర‌ణ్‌వీర్ సింగ్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియాభ‌ట్‌, క‌ర‌ణ్ జొహార్‌, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, వ‌రుణ్ ధ‌వ‌న్‌, రాజ్‌కుమార్ రావు, భూమి పెడ్నేక‌ర్‌, ఏక్తా క‌పూర్‌, ఆయుష్మాన్ ఖురానా, అశ్వినీ అయ్య‌ర్ తివారీ ఉన్నారు. ప్ర‌ధాని వారికి ఏ హామీ ఇచ్చారో గానీ.. ఫుల్ జోష్‌గా క‌నిపించారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News