మోదీ ప్రచారం పన్చేయలే… అక్కడంతా బిజెపి వోడిపోయింది

ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ ఎటువోయింది?

మధ్యప్రదేశ్,రాజస్థాన్, చత్తీష్ గడ్, మిజోరం, తెలంగాణ ఎన్నిక లలో ప్రధాని నరేంద్ర మోదీ విపరీతంగా  ప్రచారం చేశారు. గొప్పగా ప్రసంగించారు.ప్రసంగాలకు సంబంధించి మోదీని మించిన నేత ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లో లేరనే పేరుంది.  హావభావాలతో జనాన్ని ఆయన ఆకట్టుకుంటారు. వాజ్పేయి తర్వాత ఇంత గొప్పగా మాట్లాడే నాయకుడు బిజెపిలో నరేంద్ర మోదీయే.  అయితే, ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలలో 70 శాతం నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అదే విచిత్రం.

ఇండియా స్పెండ్ విశ్లేషణ ప్రకారం ఈ అయిదురాష్ట్రాల ఎన్నికలలో నరేంద్ర మోదీ 80 నియోజకవర్గాలలో ఎన్నికల సభలలో ప్రసంగించారు. వీటిలో బిజెపి గెలిచింది కేవలం 23 చోట్లే. 57 నియోజకవర్గాలలో కమలం వడలిపోయింది. మొత్తం ఎన్నికల ప్రచారం 70 శాతం (22 ర్యాలీలు) మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలోనే జరిగింది. ఆయన ప్రచారం 54 నియోజకర్గాలలో జరిగితే, బిజెపి గెలిచింది 22 స్థానాలలోనే. ఛత్తీష్ గడ్, తెలంగాణ, మిజోరాంలలో బిజెపి గెలిచింది కేవలం 26 స్థానాలలోనే. ఈ రాష్ట్రాలలో ఆయన ర్యాలీలలో ప్రసంగించారు.

ఈ రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్య నాథ్ కూడా ప్రచారం చేశారు. నిజానికి ఆయన ప్రచారం ప్రధాని ప్రచారం కంటే బాగా జరిగింది. ప్రధాని కంటే యోగి మేటి క్యాంపెయినర్ అని కూడా రుజువయింది.యోగి మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీష్ గడ్ లతో పాటు తెలంగాణలో కూడా ప్రచార సభలలో పాల్గొన్నారు. మొత్తం ఆయన 58 చోట్ల ప్రసంగించారు. యోగి క్యాంపెయిన నిర్వహించిన నియోజకవర్గాలలో 27 చోట్ల బిజెపి గెలిచింది. 52 చోట్ల వోడిపోయింది.

గెలుపు శాతం తీసుకుంటే, యోగి క్యాంపెయిన్ చేసిన చోట్ల విజయం 39.13 శాతం కాగా, మోదీ వాట కేవలం 28.75 శాతమే. మధ్యప్రదేశ్ రాజస్థాన్ లలో యోగి 27 ర్యాలీలలో ప్రసంగించారు. 21 మంది బిజెపి అభ్యర్థులను గెలిపించారు. అయితే, ఓడిపోయిన వారు 37 మంది. ఇక ఛత్తీష్ గడ్ లో 23 సీట్లలో ఆయన ప్రచారం చేశారు. అయిదుగురిని గెలిపించారు. ఈ అయిదు రాష్ట్రాలలో ఎన్నికలను తీసుకుంటే మోదీ కంటే యోగి యే స్టార్ క్యాంపెయినర్ అని తేలింది.