చిన్నవెబ్ సైట్ మీద రు.6 వేల కోట్ల దావావేసిన అంబానీ

అంబానీల గురించి ఏమ్మాట్లాడుకున్నా వేల వేల కోట్లలోనే మాట్లాడుకోవాలి. వాళ్లు అస్తులు ప్రపంచరికార్డు.  దేశంలోనయితే చెప్పాల్సిన పనిలేదు, తెగ షావుకార్లు. వాళ్ల అలవాట్లుకూడా అట్లాగే కోట్ల ఖరీదయినవే. అయితే, అంబానీలకు కోపం వచ్చినా కోట్ల నష్టం కోట్లలోనే ఉంటుందిని ఇపుడు వెల్లడయింది.

 ఈ మధ్య రాఫేల్  డీల్ రహస్యం బయటపడినప్పటినుంచి అంబానీ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. రాఫేల్ ఒప్పందంలో నుంచి  ప్రభుత్వం రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  ను తీసేసి అనిల్ అంబానీ కంపెనీని ప్రధాని మోదీ చేర్పించిన విషయం బయటపడినప్పటినుంచి ఇదీ వరస.

అసలు రాఫేల్ వప్పందమే అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకు అని, ఇది మోసం అని బిజెపి మాజీ కేంద్రమంత్రులు  అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణతో కలసి సుప్రీంకోర్టు లో కేసువేసిన సంగతి తెలిసిందే. అంబానీ విషయంలో వాళ్ల మోదీని కోర్టుకులాగాలని చూస్తున్నారు.

రాఫేల్ డీల్  మీద పత్రికలు, డిజిటల్ మీడియా సంస్థలు  తెగ రాసేస్తున్నాయి. అనిల్అంబానీ పేరు లేకుండా వార్తలు లేవు, డిబేట్లు లేవు. దీనితో అనిల్ అంబానీ కి చిర్రెత్తుకొచ్చింది. తన పేరెత్తిన వాడిమీదల్లా వేల వేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా వేస్తున్నారు. ఏదో నాలుగు రూకలు జమచేసుకుని జర బాధ్యతాయుతంగా జర్నలిస్టులుగా బతకాలనే తాపత్రయంతో ప్రారంభించిన న్యూస్ పోర్టల్స్ మీద కూడా వేలవేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా వేస్తున్నారు. రెన్నెళ్లుగా దావాల దావాలు పడుతున్నాయి.

ఇపుడు తాజాగా ఈ జాబితాలో దివైర్.ఇన్ వచ్చి చేరింది. కొంతమంది నిజాయితీ పరులయిన సీనియర్ జర్నలిస్టులు  ఏర్పాటు చేసిన ఈ  సంస్థ మీద రు. 6వేల కోట్ల విలువయినా  దావా వేసేశారు. ఈ విషయాన్ని దివైర్ .ఇన్ సంస్థాపక ఎడిటర్ ఎంకె వేణు ట్వీట్ చేశారు.

 

ఇట్లాంటి లా సూట్స్ కేవలం బెదరగొట్టేందుకే  నని వేణుఅంటున్నారు. దేశానికి హానికరమయిన అంశాల మీద జరిగే  చర్చల్ల పౌరులెవరూ పాల్గొనకుండా చేసేందుకు  ఇలాంటి స్లాప్ (SLAPP : Strategic Law Suit Against Public Participation) లు వేస్తారని, తాము బెదిరేది లేదని, పోరాటం చేస్తామని ఆయన ది క్వింట్ కు చెప్పారు. 

రాఫేల్ ఒప్పందాన్ని విమర్శిస్తూ అంబానీ పేరెత్తిన ప్రతివాడి మీద ఇలా వేలకోట్ల పరువునష్టందావాలువేయడం అంబానీకి మామూలయిపోయింది. అక్టోబర్ నుంచి మీడియాను అంబానీ ఇలా దావాలతో బెదరగొడుతున్నారు. అనిల్ అంబానీ నుంచి వేల కోట్ల రుపాయల విలువయిన నోటీసులు అందుకున్నవారిలో ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇలా ఆయన వేసిన దావాల మొత్తం రు.65 వేల కోట్లకు చేరుకుంది. ఇందులో ఎన్ డిటివి మీద వేసిన దావా రు.10 వేల కోట్లతో  టాప్ లో ఉంటుంది. రెండో దావా The Citizen సంస్థాపక సంపాదకురాలు సీమా ముస్తఫా  మీద వేశారు. దీని విలువ  రు. 7000 కోట్లు. 

 ఆతర్వాతి స్థానం చెరో అయిదు వేల కోట్లతో   నేషనల్ హెరాల్డ్  , ఆమ్ ాఆద్మీ  పార్టీ నేత సంజయ్ సింగ్ లది. ఈ లెక్కన ఇలా  విమర్శకుల మీద దావాల యుద్ధం ప్రకటించిన ఉదాహరణలో చరిత్రలో మరొకటి లేదని  ది టెలిగ్రాఫ్ రాసింది. ఇది కాకుండా మరొక రు. 15,500 కోట్లకు మరొక అయిదు దావాలు వేశారని నిన్న  ది స్క్రోల్ న్యూస్ పోర్టల్ రాసింది.  దీనితో దావాల మొత్తం 16 కేసుల మీద రు. 85 వేల కోట్లకు చేరుకుంది. ఇది రాఫేల్ డీల్ కంటే ఎక్కువేమో.

అనిల్ అంబానీ దావా నోటీసులు అందుకున్న సంస్థలలో అంతర్జాతీయ సంస్థలయిన బ్లూమ్ బర్గ్, ఫైనాన్సియల్ టైమ్స్ కూడా ఉన్నాయి.