మోడీ కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే జై కొడతారా.?

బీజేపీ నినాదమే.. ఒక్క ఓటు, రెండు రాష్ట్రాలు.! కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పార్టీ స్వరం మారబోతోందా.? ‘విభజన తీరు అన్యాయం, అక్రమం..’ అంటూ గతంలో పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ నినదించారు.

నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నది విభజన తీరుని. ఆయన ఆక్షేపణలోనూ అర్థముంది. కానీ, గడచిన ఎనిమిదిన్నరేళ్ళలో విభజన సమస్యల కోసం ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ చేసింది ఏంటి.? అన్న ప్రశ్నకు మాత్రం బీజేపీ దగ్గర సరైన సమాధానం లేదు.

కాగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే.? అన్న చర్చ తెరపైకొస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి తొలుత ఈ మాట వచ్చింది. ఢిల్లీ స్థాయిలో వైసీపీకి వున్న నెట్‌వర్క్ నేపథ్యంలో, ఢిల్లీ లీకుల ద్వారా వైసీపీ ఈ కామెంట్ చేసిందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

అయితే ఏపీ – తెలంగాణ మళ్ళీ కలిసే అవకాశమే లేదని అటు ఏపీ కమలనాథులు, ఇటు తెలంగాణ కమలనాథులూ చెబుతున్నారు. కానీ, ఢిల్లీ స్థాయిలో జరిగే నిర్ణయాలపై ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకూ పెద్దగా సమాచారం వుండకపోవచ్చన్న వాదనా లేకపోలేదు.

ఎవరి గోల వారిదే.! విభజన తీరు బాగా లేదని, తల్లిని చంపేసి.. బిడ్డకు పురుడు పోసినట్లుగా విభజన చేశారనీ గతంలో వ్యాఖ్యానించిన నరేంద్ర మోడీ, మళ్ళీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పునరుద్ధరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయనే ఆలోచన చేస్తే.?

తెలంగాణ ప్రాంత నాయకులు ఆందోళన చెందుతున్న వైనం, ఏపీ ప్రాంత నేతలు ఉమ్మడి రాష్ట్రంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్న వైనం చూస్తోంటే, ఎక్కడో తేడా కొడుతున్నట్టే వుంది.