ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాపై బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నాయకులు సెటైర్లు మొదలు పెట్టారు. ఆమె అందాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ చాలా అందంగా ఉంటుందని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదని చెప్పారు.
అందమైన ముఖాలను చూసి జనం ఓట్లు వేయరనీ అన్నారు. రాబర్ట్ వాద్రా భార్య కావడం కూడా ప్రియాంకా గాంధీకి మైనస్ పాయింటేనని పాయింట్ లేవదీశారాయన. రాబర్ట్ వాద్రాపై అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. భూ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు ఉన్న రాబర్ట్ వాద్రా భార్యగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ వాద్రాను జనం తమ నాయకురాలిగా స్వాగతించబోరని అన్నారు.
Bihar Min Vinod Narayan Jha on Priyanka Gandhi: Votes can't be won on basis of beautiful faces. Moreover, she is wife of Robert Vadra who is accused of involvement in land scam&several corruption cases. She's very beautiful but other than that she holds no political achievement. pic.twitter.com/vFzffKtdrJ
— ANI (@ANI) January 25, 2019