పెళ్లి మంటపానికి వరుడు ఎలా చేరుకుంటాడో మనకు తెలుసు. దర్జాగా గుర్రంపైకి ఎక్కి లేదా ఖరీదైన ఓపెన్ టాప్ కారులోనో ఊరేగింపుగా కల్యాణమంటపానికి వస్తాడు. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు చూశాం కూడా. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఓ యువకుడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు.
తన పెళ్లిని జనం అందరూ గుర్తుంచుకోవాలనుకున్నాడో..ఏమో గానీ రోడ్డు రోలర్‌లో కూర్చుని ఊరేగింపుగా పెళ్లిమంటపానికి వచ్చాడు. పూలతో అందంగా అలంకరించిన రోడ్డు రోలర్..నెమ్మదిగా దొర్లుకుంటూ వస్తుండగా..క్యాబిన్‌లో ఆపరేటర్ పక్కన కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిపించాడు వరుడు. ఈ ఊరేగింపులో వెహికల్ ఒక్కటే మారింది గానీ, మిగిలినదంతా సేమ్ టు సేమ్. రోడ్డు రోలర్‌కు ఎదురుగా బాజా భజంత్రీలు, బంధుగణం కోలాహలం, మేళతాళాలు, సీరియల్ లైట్లు కామన్‌గా కనిపించాయి.
పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వరుడి పేరు అర్కాపాత్ర. అతని ఈ వెరైటీ ఐడియాను కాబోయే భార్య అరుంధతి తఫ్దార్ కూడా అంగీకరించిందట. దీన్ని వీడియో తీసిన వరుడి స్నేహితులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.