నితిన్ సంపాదించుకున్న ఆస్తులు ఎంతో తెలుసా?

నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.నిర్మా తగా, డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్న సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి లకు 1983లో మార్చి 30లో తెలంగాణలోని నిజామాబాద్ లో జన్మించారు. నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి ఇతనిని నితిన్, చింటూ అనే పేర్లతో పిలుస్తుంటారు. నితిన్ విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే జరిగింది. నితిన్ కు ఒక సోదరి ఉంది పేరు నిఖిత రెడ్డి, ఈమె కూడా ఒక నిర్మాత. నితిన్ కు 2020 ఏప్రిల్ 15న శాలిని కందుకూరి అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నామా లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

నితిన్ ఇంటర్ చదువుతున్న సమయంలో తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన జయం సినిమా ద్వారా హీరోగా అడుగు వేశాడు. మొదటి సినిమా తోనే విజయం అందుకున్నాడు. తర్వాత సినిమాలు కొన్ని ప్లాప్ అయినా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, భీష్మ లాంటి సినిమాల ద్వారా నిలదొక్కుకున్నాడు. కెరీర్ ని చక్కగా టర్న్ చేసుకున్నాడు. ఇక పోతే నితిన్ దగ్గర 2017లో కొనుగోలు చేసిన జాగూర్ ఎక్స్ ఎఫ్ కారు ఉంది, దీని ఖరీదు సుమారు 55.60 లక్షలు ఉంటుంది. ఇంకా బీఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్, దీని ధర 75.30 లక్షలు ఉంటుంది. ఇది కేవలం 10 సెకండ్లలో 180 నుంచి 190 స్పీడ్ తో వెళ్తుంది. ఇంకా పార్సి సెయాని, దీని ఖరీదు 1.2 కోట్లు ఉండవచ్చు. 6.8 సెకండ్లలో 230 నుంచి 240 స్పీడ్ లో వెళ్తుంది. వీటితోపాటు డుకాటి పనిగల్ వీటు బైక్ దీని ఖరీదు16.90 లక్షలు.

2020లో వచ్చిన భీష్మ సినిమా విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇందుకు గాను నితిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల కు స్వయంగా రేంజ్ రోవర్ ఇవాక్యు కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఖరీదు 59.40 లక్షలు ఉంటుంది. దీని స్పీడు దాదాపు 9.4 సెకండ్లలో 170 నుండి 180 లో ఉంటుంది. ఇంకా నితిన్ హౌస్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంటుంది దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు దీని ఖరీదు ఉండవచ్చు.

ఇక నితిన్ ఫేవరెట్ థింగ్స్ ఏంటో చూద్దాం. ఈయన హిందూజం కు చెందినవాడు, ఎత్తు 5.9 అడుగులు, బరువు 72 కేజీలు, హెయిర్ కలర్ బ్లాక్, కళ్ళు లైట్ బ్రౌన్ రంగులో ఉంటాయి. నచ్చిన హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్. నచ్చిన హీరోయిన్లు నదియా, సౌందర్య. ఇష్టమైన ఫుడ్ బంగాళదుంప కర్రీ, చపాతి. ఇష్టమైన ప్రదేశం ఆస్ట్రేలియా. హాబీస్ వాచింగ్ టీవీ, డాన్సింగ్, సింగింగ్. నితిన్ ఒక సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. దాదాపు 73 కోట్ల ఆస్తిని కూడా పెట్టినట్టు సమాచారం. ఇదండీ మన ఫేవరెట్ హీరో నితిన్ లైఫ్ స్టైల్ వివరాలు.